: టీ కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడరు: డిప్యూటీ సీఎం


తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీని విడిచివెళ్లరని భావిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఢిల్లీలో దామోదర భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు జరిగిన భేటీలో.. రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రుల వ్యవహారంపై సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అధినేత్రికి వివరించినట్లు చెప్పారు. ఇంకా పలు విషయాలపైనా మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News