: రేపు చంద్రబాబు మనవడికి బారసాల... పరిమిత సంఖ్యలో బంధువులకు ఆహ్వానం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంట రేపు బారసాల కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు కుమారుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి దంపతులకు ఇటీవల పండంటి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చంద్రబాబు కుటుంబంతో పాటు బాలయ్య కుటుంబం కూడా సంబరాల్లో మునిగిపోయింది. రేపు చంద్రబాబు నివాసంలో లోకేశ్ కుమారుడి బారసాల జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన లోకేశ్, పరిమిత సంఖ్యలోనే బంధువర్గానికి ఆహ్వానాలు పంపారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు బాలయ్య కుటుంబం, మరికొందరు సమీప బంధువులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News