: రామలింగరాజు దోషి... తుది తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు!
సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు దోషి అని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించింది. ఆయనపై వచ్చిన అభియోగాలు సాక్ష్యాలతో రుజువు అయ్యాయని న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ప్రకటించారు. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. రామలింగరాజుతో పాటు నిందితులు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, తాళ్ళూరి శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం తదితరులు కోర్టుకు హాజరుకాగా, వారి సమక్షంలో న్యాయమూర్తి తీర్పు చదివారు. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఎటువంటి శిక్షను కోర్టు విధిస్తుంది అన్న విషయం మధ్యాహ్నం వెల్లడి కానుంది.