: ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ కాదంటున్న కాంగ్రెస్ నేత


నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కాదని, కేవలం మతపరమైన కార్యకలాపాలు సాగించే సంఘం మాత్రమేనని కాంగ్రెస్ నేత ఖుర్షిద్ అహ్మద్ సయీద్ వ్యాఖ్యానించారు. భారత్ తో పాటు యూఎస్ సైతం ఐఎంపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. గోవా పర్యటనలో ఉన్న ఖుర్షిద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ముస్లిం ఉగ్రవాదులు ఉండొచ్చుగానీ, భారత సంతతికి చెందిన ముస్లింలు ఎప్పుడూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. భారత ముస్లింలలో ఛాందసవాదం లేదని తెలిపారు. 2010, 2011 సంవత్సరాల్లో జరిగిన బాంబు దాడుల్లో ఐఎం ప్రమేయంపై ప్రశ్నించగా, అది కొందరు పనిగట్టుకొని చేసిన ప్రచారమని అన్నారు.

  • Loading...

More Telugu News