: అమెరికాలో కన్నుల పండువగా ఉగాది వేడుకలు... ఒమాహాలో ఉట్టిపడిన తెలుగుదనం


అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహాలో తెలుగుదనం ఉట్టిపడింది. మన్మథ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా తెలుగు వారు పాలుపంచుకున్నారు. బాల కొత్తపల్లి పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, పాటలు హోరెత్తాయి. కార్యక్రమంలో శ్వేతా వెల్లంకి, దిలీప్ వెంకటేశ్, మరికొంత మంది యువత యాంకరింగ్ ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమంలో భాగంగా తెలుగు క్విజ్ పోటీలు నిర్వహించిన టీఎస్ఎన్, విజేతలకు బహుమతులను అందజేసింది. ఈ సందర్భంగా టీఎస్ఎన్ అధ్యక్షుడు మహేష్ గుడారు తెలుగు భాష విశిష్టత, ప్రాముఖ్యత తదితరాలను వివరించారు. సంస్థ నిర్వహించిన పలు కార్యక్రమాలను ఆయన ఆహూతులకు వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తెలుగు రుచులతో కూడిన పసందైన విందును టీఎస్ఎన్ ఏర్పాటు చేసింది. సంస్థ సభ్యుల సమష్టి కృషి వల్లే ఉగాది సంబరాలను వేడుకగా జరుపుకున్నామని టీఎస్ఎన్ కార్యదర్శి రాంబాబు కల్లేపల్లి అన్నారు.

  • Loading...

More Telugu News