: ఇద్దర్ని చంపగానే హీరోలు అయ్యారా?: ఎస్కార్ట్ పోలీసులపై వికార్ మాటల దాడి!


వరంగల్-నల్గొండ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన వికారుద్దీన్ కు పోలీసులంటేనే మహా చికాకట. పోలీసులను చూడగానే అతడు వెర్రెత్తిపోయేవాడట. వెకిలి చేష్టలతో, హేళన చేసేలా మాట్లాడటంతో పాటు దాడులకు దిగేందుకు ఏమాత్రం వెనుకాడేవాడు కాదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు మొన్న ఎన్ కౌంటర్ జరిగే రోజు కూడా పోలీసులపై అదే మాదిరిగా మాటల తూటాలు పేల్చాడట. ‘‘ఇద్దరిని చంపగానే హీరోలు అయ్యారా?’’ అంటూ నల్గొండ జిల్లా జానకీపురం ఘటనను ప్రస్తావించి, ఎస్కార్ట్ సిబ్బందిని హేళన చేశాడట. అనంతరం పోలీసులపై తిరగబడటమే కాక తప్పించుకునేందుకు యత్నించి, పోలీసుల కాల్పుల్లో తన అనుచరులు సహా హతమయ్యాడు. జైలుకు తరలించే ప్రతిసారి వికారుద్దీన్ ఇదే తరహాలో పోలీసులను సూటిపోటి మాటలతో వేధించడమే కాక దాడులకూ దిగేవాడట. ఈ కారణంగా అతడిని కోర్టుకు తరలించే సమయంలో ఎస్కార్ట్ డ్యూటీకి వెళ్లేందుకు పోలీసులు జంకేవారట. మొన్నటి ఎన్ కౌంటర్ కు ముందు కూడా ఉదయం 8.30 గంటలకు వాహనం ఎక్కినప్పటి నుంచి అతడు పోలీసులపై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడట.

  • Loading...

More Telugu News