: ఆయుధాలతో ఆగంతుకుల సంచారం: పోలీసులు అప్రమత్తం
ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దులో ఆయుధాలతో ఆగంతుకులు సంచరిస్తున్నట్టు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దాంతో రెండు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలేరు, కోదాడ, నేలకొండపల్లి మండలాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ ప్రారంభించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులను కాల్చేసిన దుండగుల్లో ఒకడు బ్యాగ్ తో పారిపోయిన సంగతి తెలిసిందే. అలాగే కృష్ణా జిల్లాలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి కారుతో ఓ వ్యక్తి పరారైన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనల్లోనూ ఆగంతుకులను పోలీసులు పట్టుకోలేదు. తాజా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వెదుకులాట ప్రారంభించారు.