: యోగ్ రాజ్ వ్యాఖ్యలు విచారకరం: ధోనీ మాజీ కోచ్
యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ టీమిండియా కోచ్ మహేంద్రసింగ్ ధోనీపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన కోచ్ చంచల్ భట్టాచార్య అన్నారు. యోగ్ రాజ్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ, యోగ్ రాజ్ సింగ్ మంచి క్రికెటర్ అన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని ఆయన చెప్పారు. రావణాసురుడిలాగే భారత కెప్టెన్ ధోనీ కూడా మూల్యం చెల్లించుకుంటాడని యోగ్ రాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.