: పాతబస్తీలో భారీ బందోబస్తు
హైదరాబాదులోని పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ-వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్ అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో అత్యంత సున్నితమైన పాతబస్తీలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఓల్డ్ మలక్ పేటలోని వికారుద్దీన్ గృహానికి అతని పార్థివదేహాన్ని తరలించగా, మరో ఉగ్రవాది అంజద్ మృతదేహాన్ని కూడా వికారుద్దీన్ ఇంటికే తరలించారు. దీంతో సైదాబాద్, సంతోష్ నగర్, మలక్ పేటలలో సీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భద్రత చేపట్టారు.