: 'ఫ్రీచార్జ్' సంస్థ ఇప్పుడు స్నాప్ డీల్ సొంతం


ఆన్ లైన్ మొబైల్ రీచార్జ్ సంస్థ 'ఫ్రీచార్జ్' (freecharge) ను ఇ-రిటైలర్ వెబ్ సైట్ స్నాప్ డీల్.కామ్ కొనుగోలు చేసింది. అయితే అమ్మకం ఒప్పందం ఎంతకు కుదిరిందనే విషయాన్ని సదరు వెబ్ సైట్ వెల్లడించలేదు. వేగంగా పెరుగుతున్న మొబైల్ లావాదేవీల వ్యాపారంలో స్నాప్ డీల్ కు ఇది మంచి ప్రోత్సాహాన్నిస్తుందని అంటున్నారు. స్నాప్ డీల్ లో సాప్ట్ బ్యాంకు పెట్టుబడుల నేపథ్యంలో దేశంలోని ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్.కామ్ తో తీవ్రంగా పోటీపడుతోంది. ఈ మేరకు స్నాప్ డీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కునాల్ బాల్ మాట్లాడుతూ, ఈ రెండు కంపెనీలు ఏకమైనప్పుడు రోజుకు ఒక మిలియన్ మొబైల్ లావాదేవీలు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 75 శాతం స్నాప్ డీల్ లావాదేవీలు కూడా మొబైల్ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఒప్పందం తరువాత కూడా ఫ్రీచార్జ్ స్వతంత్ర వేదికగా ఉంటుందని బాల్ చెబుతున్నారు. ఫ్రీచార్జ్ సొంతం చేసుకున్న క్రమంలో స్నాప్ డీల్ భారత్ లో అతిపెద్ద మొబైల్ కామర్స్ సంస్థగా ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News