: భూ సేకరణ బిల్లు రాజ్యసభలో పాసైతే 30 కోట్ల మందికి ఉద్యోగాలు: అరుణ్ జైట్లీ
భూ సేకరణ సవరణ బిల్లు రాజ్యసభలో పాసైతే 30 కోట్ల మందికి పారిశ్రామిక కారిడార్లలో ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దానివల్ల పేదలు, దళితులు, గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని ఢిల్లీలో ముద్రా బ్యాంకు ప్రారంభోత్సవం అనంతరం తెలిపారు. దేశంలో 5.77 కోట్ల మంది చిన్న పారిశ్రామికవేత్తలున్నారని, వారిపై 20 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే ముద్రా బ్యాంకును ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బ్యాంకు సూక్ష్మరుణ సంస్థలకు తిరిగి రుణాలు ఇస్తుందన్నారు.