: శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ వాయిదా... ఏపీ డీజీపీకి కోర్టు నోటీసు
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. అయితే ఎన్ కౌంటర్ ఘటనపై ఈ నెల 10లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఏపీ డీజీపీ జేవీ రాముడుకు నోటీసు ఇచ్చింది. ఈ ఘటనపై ఈరోజు దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, స్పెషల్ ఆపరేషన్స్ డీజీలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.