: శేషాచలం ఎన్ కౌంటర్ ఎఫెక్ట్... పులికాట్ సరస్సులో చేపల వేట నిలిపివేత!


చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ, తమిళనాడుల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్ కౌంటర్ సమాచారం తెలిసిన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళ సంఘాలు చెన్నైలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై దాడికి దిగాయి. దీంతో ఏపీ సర్కారు చెన్నైకి బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పరిధిలోని పులికాట్ సరస్సులో చేపల వేటను ఏపీ సర్కారు నిషేధించింది. ఏపీ జాలర్లపై తమిళులు దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. అంతేకాక ఇప్పటికే చేపల వేట కోసం సరస్సులోకి వెళ్లిన జాలర్లను వెనక్కు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News