: సిద్ధయ్య ప్రతిరూపం బతికింది... రెయిన్ బో వైద్యుల ఆపరేషన్ సక్సెస్!


ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో సూర్యపేట షూటర్స్ బుల్లెట్ల కారణంగా తీవ్ర గాయాలతో ఎస్సై సిద్ధయ్య ఆస్పత్రిలో చేరిన కొద్దసేపటికే అదే ఆస్పత్రిలో ఆయన ప్రతిరూపం కన్ను తెరిచింది. సిద్ధయ్యను చూసేందుకు వచ్చిన ఆయన భార్యకు పురిటి నొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో చేర్పించారు. కొద్దసేపటికే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కొడుకును గాని, తన కొడుకుకు జన్మనిచ్చిన భార్యను కాని చూడకుండానే నిన్న సాయంత్రం సిద్ధయ్య తుది శ్వాస విడిచారు. అయితే సిద్ధయ్య చావుబతుకుల మధ్య కొట్టాడుతుంటే, ఆయన కొడుకు కూడా అనారోగ్యంతో సతమతమయ్యాడు. కామినేని వైద్యులు సరిగా చూసుకోవడం లేదని భావించిన సిద్ధయ్య కుటుంబ సభ్యులు శిశువును చిన్న పిల్లల ఆస్పత్రి రెయిన్ బోకు తరలించారు. అప్పటికే ఆరోగ్యం బాగా క్షీణించిన బాలుడికి రెయిన్ బో వైద్యులు ఆపరేషన్ చేసి జీవం పోశారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News