: కేట్ తరువాత రణ్ వీర్ సింగ్ మైనపు బొమ్మ?


బాలీవుడ్ లో ప్రస్తుతమున్న హీరోల్లో మోస్ట్ ఎనర్జిటిక్ నటుడు ఎవరంటే రణ్ వీర్ సింగ్ గురించే మాట్లాడుకోవాలి. తన నటన, విభిన్నమైన హావభావాలతో లక్షలమంది అభిమానాన్ని చూరగొన్నాడు. ఇతని గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నారని మీకు డౌట్ వస్తుంది కదా? పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అందాల భామ కత్రినా కైఫ్ మైనపు బొమ్మను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి వాక్స్ విగ్రహాన్ని రణ్ వీర్ ది పెట్టాలంటూ అభిమానులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారట. ఇందుకు మేడమ్ టుస్సాడ్ అధికారులు ట్విట్టర్ లో స్పందించారు. "రణ్ వీర్ సింగ్ ఫ్యాన్స్ - వాక్స్ విగ్రహం కోసం మీరు చేసిన రిక్వెస్టులను నోట్ చేసుకున్నాం. 2016లో పెట్టబోయే విగ్రహాల సమయంలో ఈ రిక్వెస్టును పరిగణలోకి తీసుకుంటాం. కృతజ్ఞతలు" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం టుస్సాడ్ మ్యూజియంలో హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారుక్ ఖాన్, కరీనాకపూర్, మాధురీ దీక్షిత్, సల్మాన్ ఖాన్ విగ్రహాలున్నాయి. తాజాగా కేట్ విగ్రహం కూడా చేరింది. మరీ స్టార్ల వరుసలో రణ్ వీర్ కూడా చేరుతాడా? తెలియాలంటే ఎదురుచూడక తప్పదు.

  • Loading...

More Telugu News