: ప్రపంచంలో తొలిసారిగా... డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో లెనోవో స్మార్ట్ ఫోన్... ధర రూ. 8,999


చైనా కేంద్రంగా పనిచేస్తున్న లెనోవో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ఏ7000ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో తయారుచేశామని, ప్రపంచంలో ఈ తరహా మూవింగ్ సౌండ్ సాంకేతికతతో లభించే తొలి మొబైల్ ఇదేనని సంస్థ తెలిపింది. 1.5 జీహెచ్ ట్రూ 8కోర్ ప్రాసెసర్, 4జి, 5.5 హెచ్ డీ డిస్ ప్లే, 8 జీబీ స్టోరేజ్ తదితర సౌకర్యాలతో లభించే ఫోన్ ధర రూ. 8,999 అని వివరించింది. ప్రస్తుతానికి ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నామని, ఫోన్ కోసం రిజిస్ట్రేషన్స్ నేటి నుంచి మొదలవుతాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News