: రుయాలో ఎన్ కౌంటర్ మృతులకు పోస్టుమార్టం... పోలీసుల చక్రబంధంలో తిరుపతి
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో నిన్నటి ఎన్ కౌంటర్ లో మరణించిన ఎర్రచందనం కూలీల మృతదేహాలకు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కొద్దిసేపటి క్రితం పోస్టుమార్టం ప్రారంభమైంది. మొత్తం 20 మంది కూలీల మృతదేహాలకు రుయాలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు, వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు రుయా ఆస్పత్రికి చేరుకున్నారు. బంధువుల రాక, మృతదేహాలకు పోస్టుమార్టం నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరాన్ని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. బారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.