: సచ్చిదానంద మ్యూజిక్ థెరపీకి అరుదైన గుర్తింపు... గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన వైనం


దీర్ఘకాలిక వ్యాధులతో పాటు స్వల్పకాలిక రుగ్మతలను దూరం చేసే విషయంలో తన మ్యూజిక్ థెరపీతో మంచి ఫలితాలను సాధిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామిజీకి మరో అదురైన గుర్తింపు దక్కింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చిన స్వామిజీ, ఈ నెల 6న ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోని ఒపెరా హౌస్ లో సుదీర్ఘ మ్యూజిక్ థెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. అనారోగ్యాలకు మందులు వాడుతూనే సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల నాడీ వ్యవస్థ, శరీరంలోని ఇతర అవయవాలు స్వాంతన పొందుతాయని స్వామిజీ భక్తులు చెబుతున్నారు. స్వామిజీ థెరపీకి గిన్నిస్ రికార్డు దక్కడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News