: గంభీర్, రోహిత్ కాస్త డిఫరెంట్


ఐపీఎల్ సీజన్ 8 సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మిగిలిన కెప్టెన్ల కంటే కాస్త విభిన్నంగా కనిపించారు. ప్రారంభ వేడుకల్లో కెప్టెన్లు ఆటగాళ్ల తరపున ప్రతిజ్ఞగా క్రికెట్ బ్యాట్ పై సంతకాలు చేశారు. టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిశాస్త్రి ఐపీఎల్ జట్ల కెప్టెన్లను సంతకాలు చేసేందుకు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా సంతకాలు చేశారు. లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసే గౌతమ్ గంభీర్ రైట్ హ్యాండ్ తో సంతకం చేయగా, రైట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ తో సంతకం చేశాడు. ఇతర కెప్టెన్లంతా ఏ చేతివాటంగా బ్యాటింగ్ చేస్తారో అదే చేతితో సంతకాలు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News