: మారిషస్ కోర్టులో గంగిరెడ్డికి చుక్కెదురు
మారిషస్ కోర్టులో ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి చుక్కెదురైంది. దీంతో గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు లైన్ క్లియరైంది. మారిషస్ లో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తున్నట్టు మారిషస్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో గంగిరెడ్డి మారిషస్ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఇంటర్ పోల్ సహకారంతో గంగిరెడ్డిని రాష్ట్ర పోలీసులు, ఏపీకి తీసుకురానున్నారు. గంగిరెడ్డిని వెనక్కి తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు విశేషమైన కృషి చేశారు. గంగిరెడ్డి నేరచరిత్రపై పూర్తి వివరాలను ఇంటర్ పోల్ కు అందజేశారు. దీంతో గంగిరెడ్డి నేరచరిత్రపై విచారణ చేసిన న్యాయస్థానం, అతని బెయిల్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపి, తక్షణం లొంగిపోవాలని ఆదేశించింది.