: పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని తూర్పుతాళ్లు, పెదమైనవంక గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. పెదమైనవంకలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాల మేరకు ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్నారు. రానున్న రెండేళ్లలో ఈ గ్రామాల్లో దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పైడిపండల మాణిక్యాలరావు, ఎంపీలు సుధాకర్ రావు, గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే బండారి మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.