: చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ... ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖ రాశారు. ఎర్రచందనం దొంగల కాల్చివేతపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మానవహక్కుల ఉల్లంఘనపై విచారణ చేయాలని లేఖలో కోరారు. హక్కుల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన కూలీల్లో తిరువణ్నామలై, వేలూరు జిల్లా వారే అధికంగా ఉన్నారని లేఖలో సీఎం పేర్కొన్నారు. అంతేగాక మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శితో సీఎం సెల్వం సమీక్షించారు.