: ఉమేష్ యాదవ్ నా కన్నా స్ట్రాంగ్... దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్


భారత క్రికెట్ జట్టులోని పేసర్ ఉమేష్ యాదవ్ కు అద్భుత భవిష్యత్ ఉందని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కితాబిచ్చాడు. ఉమేష్ కు తాను పెద్ద ఫ్యాన్ అని ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్, హైదరాబాద్ తరపున ఆడుతున్న స్టెయిన్ అన్నాడు. సమీప భవిష్యత్తులో ఉమేష్ అగ్రశ్రేణి బౌలర్ గా ఎదుగుతాడన్న నమ్మకం తనకుందని అన్నాడు. తను, ఉమేష్ ఒకేలా ఉంటామని, ఇద్దరీ ఎత్తూ సమానమని గుర్తుచేసిన ఆయన, ఉమేష్ తనకన్నా బలంగా ఉన్నాడని, బంతిని స్వింగ్ చేయగలడని అన్నాడు. కాగా, ఐపీఎల్-8లో ఉమేష్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News