: ఆయనకో నోబెల్ బహుమతి ఇచ్చుకోండి: బీజేపీ నేత వ్యాఖ్యలపై శివసేన వ్యంగ్యం


పొగాకు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీపై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పొగాకు ఉత్పత్తుల నిషేధంపై నియమించిన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా ఉన్న దిలీప్ గాంధీ 'పొగాకు క్యాన్సర్ కారకం' అనడానికి ఆధారాలు లేవని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్న ఆయనకో నోబెల్ బహుమతి ఇచ్చుకోండి' అని అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఆయన ఎప్పుడు, ఎక్కడ రీసెర్చ్ చేశారన్న విషయాన్ని మాత్రం అడగొద్దని, పొగాకు, గుట్కా వ్యాపారులకు దిలీప్ మంచి ఫేవర్ చేస్తున్నారని విమర్శించింది. పాన్ వ్యాపారాలు, పొగాకు వీరులు ఇకపై దిలీప్ చిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తారని వెక్కిరించింది.

  • Loading...

More Telugu News