: శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడు కూలీలు మరణించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. డీజీపీ, హోంశాఖ కార్యదర్శితో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడుకు చెందిన పాలు పార్టీలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా పూర్తి స్ధాయి విచారణ జరగాలని ఎండీఎంకే నేత వైగో కోరారు. శేషాచలం ఎన్ కౌంటర్ ను తమిళనాడు పీసీసీ చీఫ్ ఇళంగోవన్ ఖండించారు.