: నన్ను బతికించండి... నాకు బతకాలని ఉంది: సహచరులతో ఎస్సై సిద్ధయ్య


నల్గొండ జిల్లా జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ లో నాలుగు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోగా రక్తపు మడుగులో పడిపోయిన ఎస్సై సిద్ధయ్య చావును తప్పించుకునేందుకు తీవ్ర యత్నం చేశాడు. ప్రస్తుతం ఆయన కామినేని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సిద్ధయ్య శరీంలోకి దూసుకెళ్లిన నాలుగు బుల్లెట్లలో రెండింటిని తొలగించిన వైద్యులు మరో రెండింటిని తొలగించడంలో విఫలమయ్యారు. చికిత్సకు సిద్ధయ్య శరీరం సహకరించని నేపథ్యంలో ఆపరేషన్ చేయడం కుదరడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఉగ్రవాదుల తూటాలతో గాయాలపాలైన తనను ఆస్పత్రికి తరలిస్తున్న తన సహచర పోలీసులతో సిద్ధయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను బతికించండి. నాకు బతకాలని ఉంది’’ అంటూ ఆయన వేడుకున్న తీరును గుర్తుచేసుకుంటున్న ఆయన సహచరులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News