: విష్ణు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి... 'ఉత్తమ విలన్'పై నిషేధం విధించండి: విశ్వ హిందూ పరిషత్ డిమాండ్
కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విలన్' మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం లోని ఒక పాటతో విష్ణు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను కించపరచే అవకాశం ఉన్నందున చిత్రంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కు ఓ నివేదికను పంపింది. విష్ణుమూర్తి ప్రియ భక్తుడు ప్రహ్లాదుడు, అతని తండ్రి, రాక్షసుడు అయిన హిరణ్యకశ్యపుడికి జరిగే సంభాషణ ఆధారంగా, చిత్రంలో తెరకెక్కిన ఒక పాట ఆక్షేపణీయంగా ఉందని వీహెచ్ పీ తెలిపింది. కాగా, చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.