: రంగారెడ్డి జిల్లాలో ఆయుధాలతో తిరుగుతున్న ఇద్దరు... రంగంలోకి దిగిన పోలీసులు
హైదరాబాదుకు కూతవేటు దూరంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంటారం పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ఈ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వీరివద్ద ఆయుధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అంటారం వద్ద పెద్ద ఎత్తున మొహరించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. పోలీసులు జరుపుతున్న కూంబింగ్ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.