: కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌ నేర చరిత్ర


అరెస్ట్ కు పూర్వం కరుడుగట్టిన ఉగ్రవాది అయిన వికారుద్దీన్‌కు చాలా పెద్ద నేర చరిత్రే ఉంది. 2008లో ఐఎస్ సదన్ లో కౌంటర్ ఇంటెలిజన్స్ పోలీసును హత్య చేసిన తరువాత అతని పేరు ప్రపంచానికి తెలిసింది. 2009లో శాలిబండ దగ్గర కానిస్టేబుల్ ను కాల్చి చంపిన కేసులోనూ వికారుద్దీన్ ప్రధాన నిందితుడు. అంతకుముందు సిమీలో క్రీయాశీలకంగా పనిచేసిన వికారుద్దీన్ డీజేఎస్ పేరుతో హైదరాబాదులో కార్యకలాపాలు కొనసాగించాడు. పాక్ ప్రేరేపిత లష్కర్-ఏ-తోయిబా, ఐఎస్ఐలతో కూడా సంబంధాలు నడిపాడు. గుజరాత్ హోంమంత్రిపై జరిగిన దాడి కేసులో కూడా వికారుద్దీన్ నిందితుడు. 2010లో అతనిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంచల్ గూడా జైలులో ఉన్న సమయంలో వార్డర్లపై దాడి చేయగా, వికారుద్దీన్ గ్యాంగ్ ను వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. గత కొన్నేళ్లుగా జైల్లో ఉన్న వికారుద్దీన్ ను, మరో నలుగురిని ఓ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ తరలిస్తుండగా, ఈ ఉదయం పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దీంతో ఒక నెత్తుటి చరిత్ర ముగిసింది.

  • Loading...

More Telugu News