: శేషాచలం అడవుల్లో 2 చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది: హోంమంత్రి చినరాజప్ప


చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కార్యాచరణలో పాల్గొన్నారని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో మొత్తం 20 మంది చనిపోయారని, పరారైన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోందని మంత్రి వివరించారు. ఈ క్రమంలో జిల్లా సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. కాగా ఎన్ కౌంటర్ లో చనిపోయినవారందరూ తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. మరోవైపు ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు పరిశీలించారు. అటు శ్రీవారి మెట్టు ప్రాంతంలో కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ రాముడు వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News