: ధోనీలా ఉండాలని ఉందంటున్న ఆసీస్ క్రికెటర్
భారత జట్టు క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరు తనను ఎంతో ఆకర్షిస్తోందని, ఆయన ఎంతో కూల్ గా ఇన్నింగ్స్ ను ముగించే తీరు తనకు ఇష్టమని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హస్సీ. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హస్సీ, ధోనీలా కూల్ గా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపాడు. తాను కూడా ధోనీ మాదిరిగా ఉండాలని అనుకుంటున్నట్లు తాజాగా స్పష్టం చేశాడు. 'ధోనీ క్రీజ్ లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో, ఇన్నింగ్స్ పూర్తి చేసినప్పుడు కూడా అంతే నిశ్చింతగా ఉంటాడు. ధోనీ పవర్ అలాంటిది. నాకు కూడా అలానే ఉండాలని ఉంది' అని హస్సీ తెలిపాడు. ఎంతటి పెద్ద లక్ష్యమైనా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఆడడం గొప్ప విషయమని ప్రశంసలతో ముంచెత్తాడు.