: దర్గా వద్దే దర్జాగా రెండు రోజులు... గుట్టల్లో సూర్యాపేట షూటర్స్ బస!
సూర్యాపేట బస్టాండ్ లో అర్ధరాత్రి పోలీసులపై కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్న సిమి ఉగ్రవాదులు, ఆ తర్వాత గంటకే అర్వపల్లి గుట్టలకు చేరుకున్నారు. అనంతరం రెండు రోజులపాటు గుట్టల్లోనే విశ్రాంతి తీసుకున్న ఉగ్రవాదులు, దర్గా వద్ద కొనసాగిన దావత్ లతోనే కడుపు నింపుకున్నారట. అంతేకాక దర్గా వద్ద బ్రెడ్ ను కొనుగోలు చేసిన నిందితులు గుట్టల్లోనే ఎలాంటి భయం లేకుండా కాలం వెళ్లదీశారట. రెండు రోజుల పాటు గుట్టలు, దర్గా వద్ద సంచరించిన ఉగ్రవాదులు, బయటకు వచ్చి పోలీసుల చేతిలో హతమయ్యారు. సూర్యాపేట నుంచి కేవలం గంట వ్యవధిలోనే గుట్టలకు చేరుకున్నారంటే, వారికి సదరు ప్రాంతంపై అంతకుముందే అవగాహన ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.