: తిరుమల వద్ద భారీ ఎన్ కౌంటర్... 20 మంది స్మగ్లర్ల హతం
తిరుమల గిరులు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలోని ఈతగుంట, ఈగితీగల కోన పరిసరాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎర్ర చందనం స్మగ్లర్లు, స్పెషల్ పార్టీ పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. స్మగ్లర్లు లొంగిపోకుండా ఎదురు కాల్పులకు దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు సైతం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది స్మగ్లర్లు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. మరింతమంది పోలీసులు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.