: స్లేట్ స్కూల్ విద్యార్థి యశ్వంత్ అదృశ్యం... ఐదు రోజులుగా జాడలేని వైనం!


హైదరాబాదులోని అమీర్ పేటకు చెందిన స్లేట్ స్కూల్ విద్యార్థి యశ్వంత్ అదృశ్యమయ్యాడు. ఏడో తరగతి చదువుతున్న యశ్వంత్ ఐదు రోజుల క్రితం పాఠశాలకు హాజరై తిరిగి ఇంటికి రాలేదు. పాఠశాలలో తరగతులు ముగిసిన తర్వాత స్నేహితుడి ఇంటిలో దుర్గా పూజ ఉందని చెప్పి వెళ్లిన ఆ బాలుడు ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. బాలుడి కోసం అన్ని ప్రాంతాల్లో వెదికిన అతడి తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా బాలుడి అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అసలు బాలుడు కిడ్నాప్ అయ్యాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అన్న విషయాలు తెలియడం లేదు.

  • Loading...

More Telugu News