: తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన...ముగ్గురు నేతల సస్పెన్షన్


తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పార్టీ ప్రక్షాళన చేపట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో బిజినేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, నాగర్కర్నూల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెహ్మాన్, నాగర్కర్నూల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వల్లభరెడ్డిలున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఊహించినంత చురుగ్గా లేదని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు చేసిన నేపథ్యంలో పార్టీని రక్షించుకునే ప్రయత్నం ప్రారంభించినట్టు తాజా చర్యలు సూచిస్తున్నాయి.

  • Loading...

More Telugu News