: ఎస్ఐ సిద్ధయ్య కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ
సూర్యాపేటలో సిమి ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య కుటుంబ సభ్యులను ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సిద్ధయ్య కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఎస్ ఐ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ ఉన్నారు.