: మళ్లీ కెప్టెన్ అవుతానన్న నమ్మకం లేదు: జార్జ్ బెయిలీ


మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తానన్న నమ్మకం లేదని జార్జ్ బెయిలీ తెలిపాడు. మైఖేల్ క్లార్క్ తరువాత ఆసీస్ సారథిగా భావించిన బెయిలీ, తన కెప్టెన్సీపై ఆశాజనకంగా స్పందించలేదు. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరించి, అర్ధ సెంచరీతో రాణించిన బెయిలీ, క్లార్క్ పునరాగమనం కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. గత రెండేళ్లుగా జట్టులోకి అడపాదడపా వస్తూ పోతున్న బెయిలీ, ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్నాడు. క్లార్క్ తరువాత కెప్టెన్ గా సరిపోతాడని వెటరన్ లు బెయిలీని అభినందించారు. కానీ జట్టులో స్థిరంగా చోటు సంపాదించుకోకపోవడంతో బెయిలీ స్థానాన్ని స్టీవ్ స్మిత్ ఆక్రమించాడు. దీంతో ఆసీస్ జట్టుకు తాను రెగ్యులర్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాననే నమ్మకం కలగడం లేదని బెయిలీ తెలిపాడు.

  • Loading...

More Telugu News