: యుద్ధ విమానాలు, నౌకలు పంపండి: పాక్ కు సౌదీ విజ్ఞప్తి
యెమన్ లో తలదాచుకున్న ప్రభుత్వ వ్యతిరేక శక్తులను నాశనం చేసేందుకు యుద్ధం చేస్తున్న సౌదీ అరేబియా తమకు సాయం చేయాలని పాకిస్థాన్ కు విజ్ఞప్తి చేసింది. యుద్ధ విమానాలు, నౌకలూ, సైన్యాన్ని పంపాలని కోరింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేడు తెలిపారు. సౌదీ చేస్తున్న యుద్ధంలో పాల్గొనాలా? వద్దా? అనే విషయాన్ని పార్లమెంట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే వీటిని ఎక్కడ మోహరించాలని సౌదీ కోరుకుంటోందన్న విషయాన్ని మాత్రం ఆసిఫ్ వెల్లడించలేదు.