: లెక్చర్లు దంచుతూ, మమ్మల్నే అంటారా?: అగ్ర రాజ్యాలపై మోదీ విసుర్లు


వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించేలా భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని అభివృద్ది చెందిన దేశాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. కాలుష్య రహిత శక్తి వనరుల తయారీకి అణు ఇంధనాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న దేశాలు ఇప్పుడు పాఠాలు చెబుతున్నాయని ఆయన విమర్శించారు. అణు విభాగం సహా అన్ని రకాలుగా క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు. అణు పరిజ్ఞానాన్ని భారత్ కు ఇవ్వకుండా అగ్ర రాజ్యాలు అడ్డంకులు పెట్టాయని, వాటిని తొలగించి పెద్దఎత్తున అణు ఇంధనాన్ని తయారు చేసే అవకాశం భారత్ కు ఇవ్వాలని ఆయన కోరారు. "ఈ వ్యతిరేకత చూడండి. వాతావరణంపై ప్రపంచం లెక్చర్లు ఇస్తోంది. మనం ముందడుగు వేసి పర్యావరణానికి హాని కలగని రీతిలో అణు శక్తిని తయారు చేద్దామని వారి సహకారం కోరితే, అందుకు నిరాకరిస్తున్నారు" అని మోదీ అన్నారు. అంతకుముందు ఆయన నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) విడుదల చేశారు.

  • Loading...

More Telugu News