: సీసీ కెమెరా కేసులో 'ఫాబ్ ఇండియా' మేనేజర్ కు ముందస్తు బెయిల్


కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ 'సీసీ కెమెరా' కేసులో 'ఫాబ్ ఇండియా' మేనేజర్ కు గోవా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 హామీతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ నెల 7,8న గోవా క్రైం బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని మేనేజర్ చైత్రాలి సావంత్ ను కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫాబ్ ఇండియా మేనేజ్ మెంట్ ను విచారిస్తామని, ఇప్పటికే సమన్లు జారీ చేశామని గోవా ఐజీపీ సునీల్ గార్గ్ చెప్పారు. ఈ విషయం మహిళ రక్షణ, భద్రతకు సంబంధించినదన్నారు.

  • Loading...

More Telugu News