: నిజాయతీగా పనిచేశా.... న్యాయం, ధర్మం వైపు నిలబడ్డా: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనను కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిజాయతీగా పనిచేశానని ఆయన అన్నారు. న్యాయం, ధర్మం వైపు తాను నిలబడ్డానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోలేదన్న ఆయన, రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి, ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడానన్నారు. తానేం చేశానో ప్రజలకు తెలుసని పేర్కొన్న నరసింహన్, సమస్యల పరిష్కారంలో అందరికంటే ఒక అడుగు ముందుగానే ఉన్నానని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందించాలని ఒకరితో చెప్పించుకునే దుస్థితిలో తాను లేనని కూడా ఆయన కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఓ తెలుగు దినపత్రిక గవర్నర్ పై వరుస కథనాలు ప్రచురిస్తూ... తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్, ఏపీకి అన్యాయం చేస్తున్నారన్న రీతిలో వార్తలు రాయడంతోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News