: ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ర్యాంక్ కు చేరువలో సానియా మీర్జా


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ర్యాంక్ కు అడుగు దూరంలో ఉంది. మరో 145 పాయింట్లు సాధిస్తే మహిళల డబుల్స్ విభాగంలో ఆమెను నెంబర్ వన్ ర్యాంకు వరిస్తుంది. తాజాగా మియామీ ఓపెన్ సిరీస్ టైటిల్ దక్కడంతో సానియా ఖాతాలో 1000 పాయింట్లు చేరాయి. దాంతో ప్రస్తుతం ఆమె 7,495 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉంది. నెంబర్ వన్ ర్యాంకర్లుగా కొనసాగుతున్న ఇటలీ క్రీడాకారిణులు సారా ఎరాలీ, రాబర్టా విన్సీ ఖాతాలో 7,640 పాయింట్లు ఉన్నాయి. ఈ వారంలో చార్లెస్టన్ లో జరగనున్న ప్యామిలీ సర్కస్ కప్ లో సానియా, హింగిస్ జోడీ విజయం సాధిస్తే అగ్రస్థానానికి వెళ్లడం ఖాయం.

  • Loading...

More Telugu News