: తృణమూల్ కాంగ్రెస్ కు సీబీఐ నోటీసులు
సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ గ్రూపు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సీబీఐ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ అందజేయాలని నొటీసులో సీబీఐ పేర్కొంది. గతేడాది నుంచి ఈ స్కాంలో చురుగ్గా జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో ఇప్పటికే పలువురు తృణమూల్ ఎంపీలు, నేతలను సీబీఐ విచారించింది. కొంతమంది ప్రస్తుతం జైల్లో రిమాండులో ఉన్నారు. ఒక సమయంలో ఈ స్కాంకు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి.