: పన్ను విధానాన్ని 'స్వర్గధామం'లా చూడొద్దు: అరుణ్ జైట్లీ
భారత్ లో అమలవుతున్న పన్ను విధానాన్ని విదేశీ ఇన్వెస్టర్లు స్వర్గధామంలా భావించరాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే, తాము స్థిరమైన పన్ను విధానం అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. వివాదాస్పద 'కనీస ప్రత్యామ్నాయ పన్ను' (ఎంఏటీ)పై ఎఫ్ఐఐ (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)లు లేవనెత్తిన సందేహాలపై జైట్లీ స్పందించారు. సరైన డిమాండ్ ఉన్న చోట పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సీఐఐ అధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. పన్ను విధానంలో మరింత పారదర్శకత పాటించే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నల్లధనంపై ఇన్వెస్టర్ల నుంచి వచ్చే సూచనలను స్వీకరిస్తామని వివరించారు.