: మీరట్ లో విషాదం... అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురి సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఇంటిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. నేటి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోగానే ప్రమాదం సంభవించిన ఇంటిలోని ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు.