: కిందపడబోయిన ఫొటోగ్రాఫర్ కు చేయందించిన ప్రధాని మోదీ!
వేసే ప్రతి అడుగులోనూ ప్రధాని నరేంద్ర మోదీది విలక్షణ శైలే. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఈ విషయంలో ఆయన దరిదాపుల్లోకి రారంటే అతిశయోక్తి కాదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్న ఆయన ప్రింట్ మీడియాపైనా అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు నిన్న జరిగిన ఓ ఘటనే నిదర్శనం. నిన్న ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు కోసం విజ్ఞాన్ భవన్ కు వెళుతున్న ఆయన భవన్ ప్రాంగణంలో ఓ చోట భద్రతా వలయాన్ని దాటుకుని మరీ ప్రింట్ మీడియాకు చేయందించారు. తనను ఫొటో తీయబోయిన ఓ ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్ ఉన్నట్టుండి పట్టుతప్పి కింద పడబోయారు. వెనువెంటనే స్పందించిన మోదీ, తన చేయందించి ఆ ఫొటోగ్రాఫర్ ని పైకి లేపారు. ఈ దృశ్యాన్ని ఇతర ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.