: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన... 9న ఆహ్వానించనున్న చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని చేత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నెల 9న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధానికి ఆహ్వానం పలకనున్నారు. రాజధాని నిర్మాణానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్న చంద్రబాబు, ప్రధాని మోదీని కలిసిన తర్వాత తేదీని నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సింగపూర్ ప్రతినిధి బృందం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దిన చంద్రబాబు, పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ప్రకటించాలన్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.