: 'సంసద్ యాత్ర'కు రాజ్ నాథ్ ను ఆహ్వానించిన కోదండరామ్
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ రాజకీయ కన్వీనర్ కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ నెల 29న నిర్వహిస్తోన్న 'సంసద్ యాత్ర'లో పాల్గొనాలని కోదండరామ్ ఆయనను ఆహ్వానించారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ, దేశ రాజధానిలో ఈనెల 29,30 తేదీలలో జేఏసీ 'సంసద్ యాత్ర' నిర్వహిస్తోంది. ఇందులో పలువురు జేఏసీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు.