: హైదరాబాదులో దారుణం... డార్జిలింగ్ యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాదులో రాత్రి దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న డార్జిలింగ్ యువతిపై ఆమె స్నేహితుడు మాజిద్ సహా ఏడుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గత రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణంపై యువతి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెనువెంటనే స్పందించిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, లైంగిక దాడికి దిగిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.