: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్... జోరందుకున్న ఊహాగానాలు


తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు... కేసీఆర్ కొడుకుగా మనందరికి చిరపరిచితులే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముందు అమెరికాలో ఉన్న ఆయన, ఉద్యమం ఊపందుకున్న తర్వాత స్వదేశం తిరిగివచ్చి కార్యరంగంలోకి దూకారు. పదునైన మాటలతో, పక్కా సమాచారంతో మాట్లాడే ఆయనను నిలువరించడం దాదాపుగా దుస్సాధ్యమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం, టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టడంతో కేసీఆర్ కేబినెట్ లో కేటీఆర్ కీలక మంత్రిగా ఎదిగారు. తాజాగా పార్టీ ప్లీనరీ నిర్వహణపై గులాబీ దళపతి కేసీఆర్ దృష్టి సారించారు. క్రమంగా తన ఆరోగ్యం సహకరించకపోవడం, వయసు మీద పడుతున్న తరుణంలో పార్టీ బాధ్యతలను కొడుకుకు అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆయన యోచిస్తున్నారట. పార్టీని తనలాగే నడిపే సత్తా కేటీఆర్ లో ఉందా? అన్న కోణంలోనూ పలువురి వద్ద ప్రస్తావించి వారి అభిప్రాయాలు స్వీకరించిన కేసీఆర్, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు దాదాపు సిద్ధమయ్యారట. పార్టీ ప్లీనరీలో భాగంగా ఈ దిశగా కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పేరిట కొత్త పదవిని సృష్టించి, అందులో కేటీఆర్ ను కూర్చోబెట్టేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News